శబరిమల అయ్యప్పను దర్శించుకున్న 25లక్షల మంది
శబరిమల అయ్యప్ప స్వామిని ఈ సీజన్‌లో ఇప్పటివరకు 25 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇక్కడికి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో మొత్తంగా 21 లక్షల మంది అయ్యప్ప దర్శనానికి వచ్చారు. డిసెంబర్ చివరి వరకు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శబరిమలలో నవంబరు 16న ప్రారంభమైన మండల పూజా మహోత్సవాలు.. డిసెంబర్ 27న ముగియనున్నాయి.
