WhatsApp: రష్యాలో వాట్సప్‌పై నిషేధం..?
మాస్కో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (Rus threatens hurt on WhatsApp) పై నిషేధం విదించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రష్యా వెల్లడించింది. తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వాట్సప్ పనిచేయడం లేదని, నేరాలను అరికట్టడంలో సహకరించడం లేదని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. చట్టాలకు అనుగుణంగా సర్వీసులు లేకపోతే సంపూర్ణ నిషేధం విధిస్తామని హెచ్చరించింది. వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా యూజర్లు దేశీయ యాప్‌లను ఎంచుకోవాలని ప్రజలకు సూచించింది. ఈ విషయంపై వాట్సాప్ (Whatsoem) మాతృసంస్థ మెటా స్పందిస్తూ యూజర్ల డేటా, కమ్యూనికేషను సురక్షితంగా ఉంచే హక్కును ఉల్లంఘించేలా రష్యా చర్యలు తీసుకుంటుందని.. వాటిని తాము అడ్డుకుంటున్నందుకు మెసేజింగ్ యాప్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.
రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన రెండు మెసేజింగ్ సేవలలో టెలిగ్రామ్, వాట్సప్ ఉన్నాయి. దేశంలో ఉగ్రవాద, మోసపూరిత కార్యకలాపాలను పరిశీలించేందుకు వీలుగా ఈ మెసెంజర్ యాప్‌లు ప్రజల డేటాను ప్రభుత్వం యాక్సెస్ చేసేందుకు సహకరించాలని రష్యా ప్రభుత్వం కొంతకాలంగా పట్టుబడుతోంది. ఇందులో భాగంగా వాట్సప్ వినియోగదారులు కాల్స్ చేసుకోకుండా ఆగస్టులోనే నిషేధం విధించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ ఆప్షన్ లేని దేశీయ మెసేజింగ్ యాప్ ‘మాక్స్ ‘కు మారాలని ప్రజలకు సూచించింది. అయితే ప్రజల హక్కులు కాలరాయడానికి, దేశంలోని ఉక్రెయిన్ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకోవడానికి పుతిన్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
