మధ్యతరగతికి హైదరాబాద్ ఇక దూరమే !
🏠 ఊహించని విధంగా ఇళ్ల ధరలు
💰ORR పరిధిలో భగ్గుమంటున్న రేట్లు
కోకాపేట భూములు ఎకరానికి రూ .150 కోట్లకు చేరుకున్నాయి. ఈ సారి వేలంలో అది రెండు వందల కోట్లకు చేరుకోవచ్చు. అందరూ ఇది రియల్ భూమ్ అని ఆహో..ఓహో అని చెప్పుకోవచ్చు. కానీ అసలు విషాదం ఏమిటంటే..సొంత ఇల్లు కొనాలనుకునే సామాన్య మధ్యతరగతి ప్రజల కలలు ఈ వేలం వెర్రి కింద నలిగిపోతున్నాయి. ప్రభుత్వాల కక్కుర్తి వల్ల కరిగిపోతున్న తమ కలలను చూసిన వారు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అంతకు మించి వారేం చేయలేరు కూడా.
హైదరాబాద్ లో ఇల్లు కొనలేకపోతున్న సామాన్యుడు
వెయ్యి ఎస్ఎఫ్టీతో ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు కొనుగోలు చేయడం ఇప్పుడు మధ్యతరగతికి అసాధ్యంగా మారింది. ఓ పదేళ్ల కిందటి వరకూ ఇరవై లక్షల రూపాయలు లోన్ పెట్టుకుంటే ఇల్లు వచ్చేది. కానీ ఇప్పుడు 90 లక్షలు అప్పు చేస్తే కానీ ఇల్లు లభించడం లేదు. ఈ 90 లక్షలు బడా బిల్డర్లు కట్టే స్కై స్క్రాపర్లలో కొనేందుకు కాదు. అలాంటి చోట్ల కనీసం మూడు నుంచి నాలుగు కోట్లు ఉంటుంది. పెద్దగా సౌకర్యాలు ఉండని అపార్టుమెంట్లలలోనే ఈ 90 లక్షల ఖర్చు అవుతోంది. అంటే నెలకు లక్ష సంపాదించే ఉద్యోగి కూడా ఇల్ల.
