అర్ధరాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్!
హైదరాబాద్(డిసెంబర్ 02)
హైదరాబాద్ లో ఓ యువతీ తాగిన మైకంలో అర్థరాత్రి హల్చల్ చేసింది రోడ్డుపై వెళ్తున్న వాహన దారులకు చుక్కలు చూపించింది, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి…
షాపూర్ నగర్ చౌరస్తాలో ఓ యువతీ తాగిన మైకంలో సోమవారం అర్ధరాత్రి నడి రోడ్డుపై హల్ చల్ చేసింది… రోడ్డుపై వెళ్తున్న వాహన దారులను అడ్డుకుంటూ కేకలు వేస్తూ వీరంగం సృష్టించింది. వాహనదారు లనే కాకుండా కొద్దిసేపు పోలీసులకు కూడా చుక్కలు చూపించింది. అర్ధరాత్రి రోడ్డుకు అడ్డంగా నిలబడి కేకలు చేస్తూ పోలీసుల వాహనాన్ని పరీక్షించింది.
ఎట్టకేలకు 108 సహాయం తో యువతిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. మద్యం మత్తులో హల్చల్ చేసిన యువతి రోడా మేస్త్రి నగర్‌కు చెందిన ఇందు గా గుర్తించారు. అసలు విషయం ఏంటంటే అర్ధరాత్రి మాట దేవుడెరుగు మహిళలపై పట్టపగలే అత్యాచారాలు జరుగుతుంటే తాగిన మైకంలో అర్ధరాత్రి నడిరోడ్డుపై హల్చల్ చేసే ఇలాంటి మహిళలు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారో🤔.
