Hyderabad: చాంద్రాయణగుట్టలో కలకలం.. ఆటోలో రెండు మృతదేహాలు
చాంద్రాయణగుట్ట: నగరంలోని చాంద్రాయణగుట్టలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందడం కలకలం రేపింది. రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ఓ ఆటోలో ఇద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతులను జహంగీర్ (24), ఇర్ఫాన్ (25)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడంతోనే వారు మృతిచెందినట్లు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. అక్కడ మూడు సిరంజీలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి పరారైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
