డాలర్ దెబ్బకు రూపాయి ఢమాల్
అమెరికా డాలర్ తో పోలిస్తే భారత రూపాయి విలువ 90.14 పైసలకు పడిపోయి, కనిష్ట రికార్డు సృష్టించింది. మంగళవారం 89.96 వద్ద ఉన్న రూపాయి, ఒక్క రోజులోనే మరింత క్షీణించింది. విదేశీ పెట్టుబడులు తగ్గడం, అమెరికా అధిక సుంకాలు, భారీ దిగుమతులు రూపాయి పతనానికి కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు.డాలర్ కు ప్రత్యామ్నాయం లేకపోవడం, కొత్త కరెన్సీని తీసుకురావడంలో భారత్, చైనా, రష్యా వంటి దేశాలు విఫలం కావడం కూడా రూపాయి క్షీణతకు దోహదం చేస్తున్నాయి. ఇదే తీరు కొనసాగితే రూపాయి విలువ 91, 92కు కూడా పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.
