శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన
ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 ఉన్నాయి. ముందుగా బుక్ చేసుకున్న సర్వీసుల రద్దుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్ అయిన తర్వాత రద్దు సమాచారం ఇవ్వడంపై నిరసన తెలిపారు. మరోవైపు విశాఖ నుంచి 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌కు వెళ్లాల్సినవి ఉన్నాయి.
