This Week OTT Release: ఈ వారం ఓటీటీలో థ్రిల్లింగ్ చిత్రాలు.. అలరించే వెబ్‌సిరీస్‌లు
షరతులు లేని ప్రేమ గురించి కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (the girlfriend ott). రష్మిక, దీక్షిత్‌శెట్టి జంటగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్ర పోషించింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చి యువతను విశేషంగా ఆకట్టుకుందీ చిత్రం. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు సహా ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆరు నెలలు.. తొమ్మిది మంది మహిళల హత్యలు.. ఓ సీరియల్ కిల్లర్.. ఈ అంశాలతో రూపొందిన చిత్రం ‘స్టీఫెన్’ (stephen movie netflix). మిథున్ బాలాజీ దర్శకత్వం వహించారు. ‘గార్గి’ ఫేమ్ గోమతి శంకర్ హీరోగా నటించారు. సైకలాజికల్ నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా డిసెంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తొమ్మిది మందిని దారుణంగా చంపేసిన వ్యక్తి ఆ హత్యలు ఎందుకు.. ఎవరితో కలిసి చేశాడనే ప్రశ్నల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జటాధర’ (Jatadhara). మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో అభిషేక్ జైశ్వాల్, వెంకట్ కల్యాణ్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 7న థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
వైభవ్ కీలక పాత్రలో షెరీఫ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘రణం అరం తవరేల్’. నందితా శ్వేత, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో ‘ది హంటర్: చాప్టర్-1’ (The Hunter Chapter 1) పేరుతో థియేటర్స్‌లో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ఆహా (Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రణవ్ మోహన్‌లాల్ కథా నాయకుడిగా నటించిన సినిమా ‘డీయస్ ఈరే’. మిస్టరీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందింది. ‘భూత కాలం’, ‘భ్రమ యుగం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ (dies irae ott release) ప్రస్తుతం జియో హాట్‌స్టార్ వేదికగా మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
- నెట్‌ఫ్లిక్స్
- ది అబాండన్స్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
- ది ప్రైస్ ఆఫ్ కన్ఫెషన్ (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
- ది నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్2 (మూవీ) ఇంగ్లీష్
- న్యూయార్క్ ఎట్ 100 (మూవీ) ఇంగ్లీష్
- జేకెల్లీ (మూవీ) ఇంగ్లీష్
- ఆహా
- ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ (వెబ్‌సిరీస్) తెలుగు

- అమెజాన్ ప్రైమ్ వీడియో
- షూర్‌లీ టుమారో (వెబ్‌సిరీస్) ఇంగ్లీష్
- మ్యాన్ ఫైండ్స్ టేప్ (మూవీ-రెంట్) ఇంగ్లీష్
- సన్‌నెక్ట్స్
- అరసయ్యన ప్రేమ ప్రసంగ (మూవీ) కన్నడ
- సోనీలివ్
- కుట్రం పురిందవన్ (వెబ్‌సిరీస్) మలయాళం/ తెలుగు
- జీ5
- ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (మూవీ) తెలుగు
