Shashi Tharoor: రాహుల్‌కు కాదు.. పుతిన్‌తో విందుకు థరూర్‌కు ఆహ్వానం
భారత్‌లో పర్యటిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin)కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలకు ఆహ్వానం లభించలేదు. కానీ, ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌కు ఆహ్వానం అందడం గమనార్హం. దీనిపై థరూర్ స్పందిస్తూ.. విపక్ష నేతను ఆహ్వానించని విషయం తనకు తెలియదని, తాను తప్పకుండా హాజరవుతానన్నారు. ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపించారోననే విషయం కూడా తనకు తెలియదన్నారు.
ఆపరేషన్ సిందూర్ గురించి ప్రపంచ దేశాలకు బ్రీఫింగ్ ఇచ్చేందుకు విదేశాలకు పంపించిన ఎంపీల బృందంలో థరూర్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ఆయన (Shashi Tharoor) వ్యాఖ్యలు చేస్తుండడంతో సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే, గతంలో ఐక్యరాజ్యసమితిలో దౌత్యవేత్తగా విధులు నిర్వర్తించిన థరూర్‌కు రష్యా అధికారులతో అనుబంధం ఉండడంతోనే ఈ విందుకు ఆహ్వానం అంది ఉండవచ్చని తెలుస్తోంది.
