Rammohan Naidu: ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
దిల్లీ: ఇండిగో (Indigo)సంక్షోభం నేపథ్యంలో విమాన టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు ఇచ్చామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) స్పష్టం చేశారు. ఇండిగో విమానాల రద్దు, ప్రయాణికుల అవస్థలపై కేంద్రమంత్రి మాట్లాడారు. ‘‘ఎఫ్‌డీటీఎల్ నిబంధనలు అందరూ పాటిస్తున్నారు. ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలి. మా మంత్రిత్వశాఖ పూర్తి దృష్టి ప్రయాణికులపైనే ఉంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించాం. రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. రేపు రాత్రి 8గంటల్లోపు రీఫండ్ చేయాలని ఇండిగోను ఆదేశించాం’’ అని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
