నా పేరు రాధిక.. ఈ బస్సు కండక్టర్ను
విమానాల్లో ప్రయాణం ప్రారంభానికి ముందు ఎయిర్ హోస్టెస్లు.. తమ పేర్లు, విమానం వివరాలు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తారు. ఈ విధానాన్ని టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లోనూ అమలు చేస్తున్నారు. ‘ప్రయాణికులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు రాధిక. ఈ బస్సు కండక్టర్ను. డ్రైవర్ పేరు సాయికుమార్. మనం కరీంనగర్ నుంచి గోదావరిఖనికి ప్రయాణిస్తున్నాం. ప్రయాణికుల భద్రతకు అగ్నిమాపక పరికరాలను డ్రైవర్ క్యాబిన్ వద్ద అమర్చారు. మిమ్మల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడం ఆర్టీసీ బాధ్యత. ఆర్టీసీలో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. హ్యాపీజర్నీ’ అని ఈ కండక్టర్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని బస్సుల్లో మొదటి ట్రిప్పులో ఈ స్వాగత వచనాలు చెబుతున్నారని అధికారులు తెలిపారు.
