Brazil: టేకాఫ్ అవుతుండగా విమానం వద్ద అగ్నిప్రమాదం: దృశ్యాలు వైరల్
ఇంటర్నెట్‌డెస్క్: 180 మంది ప్రయాణికులతో టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా.. ఓ విమానంలో అగ్నిప్రమాదం సంభవించింది (Plane Catches Fire). పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
బ్రెజిల్ (Brazil)లోని గ్వారుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లాటమ్ ఎయిర్‌లైన్స్ (LATAM Airlines)కు చెందిన ఎయిర్‌బస్ ఏ320 విమానం 180 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో క్యాబిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. ప్రయాణికులను కిందకు దించేశారు. ఈ క్రమంలో విమానం నుంచి పెద్దఎత్తున మంటలు, పొగ వెలువడ్డాయి. ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై లాటమ్ విమానయాన సంస్థ స్పందించింది. విమానంలో ఎలాంటి మంటలు చెలరేగలేదని.. లగేజీ ఎక్కించే లోడర్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపింది.
