సర్పంచుల విధులేంటో తెలుసా?
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టం.. సర్పంచ్లు నిర్వర్తించాల్సిన బాధ్యతలను స్పష్టంగా నిర్వచించింది. సామూహిక మరుగుదొడ్ల ఏర్పాటు, బావుల మరమ్మతులు, పూడికతీత, జనన, మరణాలను నమోదు చేయాలి. వ్యాధుల నివారణకు చర్యలు, శ్మశానవాటికల నిర్వహణ, అనాథ శవాల దహన సంస్కారాలు నిర్వహించాలి. ధర్మశాలలు, అతిథి గృహాల నిర్మాణం, నిర్వహణ చేపట్టాలి. మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతులు, వీధులు శుభ్రం చేయించడం, వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ వంటివి చూసుకోవాలి.
