గుమ్మడి నర్సయ్యను కలిసిన కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు
ఇల్లెందు ఎమ్మెల్యేగా ఐదుసార్లు ఎన్నికైన ప్రముఖ రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త గుమ్మడి నర్సయ్యను కారేపల్లి మండలంలోని టేకులగూడెంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ దంపతులు కలిసారు. నర్సయ్య రాజకీయ జీవితచరిత్రపై నిర్మిస్తున్న బయోపిక్లో శివరాజ్కుమార్ నటించనుండగా శనివారం పాల్వంచలో సినిమా ప్రారంభ వేడుక జరగనుంది. ప్రజల మనిషిగా పేరొందిన గుమ్మడి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన తనకు తండ్రిలాంటి వారని శివన్న అన్నారు.
