బస్సు ప్రమాదం.. ఘటనా స్థలానికి హోంమంత్రి
అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన బస్సు ప్రమాద స్థలానికి హోం మంత్రి అనిత హుటాహుటిన బయలుదేరారు. మరికాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి.. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మంత్రి సంధ్యారాణి సైతం ఘటనా స్థలానికి బయల్దేరారు. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు.
