సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య
లవ్ మ్యారేజ్ గురించి మాట్లాడదామని ఇంటికి పిలిచి యువకుడిని హతమార్చిన యువతి కుటుంబ సభ్యులు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మ గూడలోని సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో రూమ్ తీసుకుని నివాసం ఉంటున్న జ్యోతి శ్రావణ్ సాయి(20) అనే యువకుడు.
అదే కాలేజీలో చదువుతున్న సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ(19) అనే యువతితో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న శ్రావణ్.
పెళ్లి గురించి మాట్లాడదామని ఇంటికి పిలిపించి, ఒక్కసారిగా శ్రావణ్ సాయిపై బ్యాట్లతో దాడి చేసి హత్య చేసిన శ్రీజ కుటుంబ సభ్యులు.
శ్రావణ్ సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
