PM Modi: కేరళలో భాజపా సరికొత్త చరిత్ర.. మోదీ హర్షం

ఇంటర్నెట్ డెస్క్: తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడం (BJPs victory in the Thiruvananthapuram Corporation)పై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) హర్షం వ్యక్తం చేశారు. కేరళ రాజకీయాల్లో ఇదో కీలక మలుపుగా అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో తమ కార్యకర్తలు చేసిన కృషి వల్లే దాదాపు 45 ఏళ్లుగా ఈ స్థానంలో అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ను ఓడించగలిగినట్లు పేర్కొన్నారు. ఈ విజయం కోసం శ్రమించిన భాజపా కార్యకర్తలను అభినందించారు. కేరళ అభివృద్ధి భాజపాతో మాత్రమే సాధ్యమని ప్రజలు నమ్మడం వల్లే తమ పార్టీ విజయం సాధించిందన్నారు. తిరువనంతపురం అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి భాజపా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.
ఎన్నికల ఫలితాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి: శశిథరూర్
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Congress MP Shashi Tharoor) శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫలితాలు నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమన్నారు. 45 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ చేస్తున్న అక్రమాలను చాలా సార్లు ప్రశ్నించానని..వారి పాలన నుంచి బయటపడాలని ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు ఈ ఫలితాలతో తేలిందన్నారు.
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా విజయం
తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ విజయం సాధించింది. ఈ గెలుపుతో 45 ఏళ్లుగా ఆ స్థానంలో అధికారంలో ఉన్న వామపక్ష పాలనకు ముగింపు పలికింది. తిరువనంతపురం కార్పొరేషన్లోని 101 వార్డుల్లో భాజపా 50, ఎల్డీఎఫ్ 29, యూడీఎఫ్ 19, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాలు గెలుచుకున్నారు.
