ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్
TG: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 20 ఏళ్లుగా పెండింగ్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
జీవో 45పై దాఖలైన పిల్స్ విచారణలో ప్రతి పిటిషన్‌కు రూ.5 వేల పెనాలిటీ విధించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయసేవా సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. అన్ని పిటిషన్లకు కౌంటర్ దాఖలు చేయడానికి జనవరి 9 వరకు తుది గడువు ఇచ్చింది.
