రూ.10 ఇవ్వలేదని హత్య చేసిన బాలుడు
విజయవాడలోని కొత్తపేటలో దారుణం చోటు చేసుకుంది. మద్యం తాగడానికి రూ.10 ఇవ్వలేదని ఓ బాలుడు విచక్షణా రహితంగా కత్తితో పొడిచి తాతాజీ అనే వ్యక్తిని హత్య చేశాడు. బాధితుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. బాలుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
