ఫాస్టాగ్ పై కేంద్రం శుభవార్త: ఇక నో టోల్ గేట్స్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ వ్యవస్థ దేశంలోని అన్ని టోల్ గేట్ల వద్ద అందుబాటులోకి రానుంది. 2026 చివరి నాటికి దీన్ని అమలు చేయాలని ఉపరితల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. భవిష్యత్తులో ఏఐ, ఉపగ్రహ ఆధారిత వ్యవస్థ ద్వారానే టోల్ వసూళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. టోల్ ఛార్జీల వసూళ్లు AI ఆధారిత వ్యవస్థల ద్వారానే జరుగుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
ఈ నూతన టోల్ విధానం శాటిలైట్, AI సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. వాహనదారులు టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం లేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో కూడా సునాయాసంగా దాటిపోవచ్చు. ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టోల్ వ్యవస్థ ద్వారా 1,500 కోట్ల రూపాయల మేర ఇంధనం ఆదా అవుతుంది. ప్రభుత్వానికి అదనంగా రూ. 6,000 కోట్ల రూపాయలు సమకూరుతాయని నితిన్ గడ్కరీ అంచనా వేశారు. వాహనదారులు, కేంద్ర ప్రభుత్వానికి లాభదాయకంగా విన్ టు విన్ విధానంలో ఉంటుందని చెప్పారు.
AI టోల్ కలెక్షన్లు మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో విధానం కింద పనిచేస్తుంది. జాతీయ రహదారులపై టోల్ బూత్‌లు ఉండవు. వాటి స్థానంలో గాంట్రీ గేట్స్ నిర్మితమౌతాయి. ఈ గాంట్రీ గేట్లపై హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చుతారు. ఒక వాహనం గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. దాని నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషిస్తాయి. ఈ వ్యవస్థ ఆయా గేట్ల ఎంట్రీ/ఎగ్జిట్ లల్లో అమర్చుతారు. టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయి.
