ప్రభాకర్ రావును విచారిస్తున్న సజ్జనార్ సిట్
TG: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగం పుంచుకుంది. ఈ కేసు దర్యాప్తుకు ఏర్పాటైన హైదరాబాద్ సీపీ సజ్జనార్ సిట్ ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును విచారిస్తోంది. కేసు నమోదైన తర్వాత కీలక ఆధారాలైన హార్డ్ డిస్కులు, ఎలక్ట్రానిక్ డేటా, ఫోన్లు, ల్యాప్టాప్లు ఏం చేశారనే దానిపై ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయమే పీఎస్కు చేరుకున్న సిట్ అధికారులు వారం రోజులపాటు విచారించనున్నారు.
