అహ్మదాబాద్‌లో దారుణం: మహిళను చెంపదెబ్బ కొట్టిన ట్రాఫిక్ పోలీస్ !
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ ఓ మహిళ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతోంది. సమాచారం ప్రకారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ డిసెంబర్ 19న సాయంత్రం ఆమె బండిపై వెళ్తుండగా, ట్రాఫిక్ పోలీసులు ఆమెను ఆపి లైసెన్స్ అడిగారు. ఆమె తన లైసెన్స్ చూపించింది. అయితే ఆ సమయంలో పోలీసు ఐడి కార్డు కింద పడిందని ఒక ట్రాఫిక్ పోలీస్ ఆమెపై కోపంతో ఊగిపోయి అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడు. దింతో ఆమెకి తీవ్రంగా గాయమైంది.
తనను కొట్టడమే కాకుండా బూతులు తిడుతూ బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సాయం కోసం ‘112’ నంబర్‌కు కాల్ చేసినా స్పందన లేదని పేర్కొంది. కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, మొదట ఎఫ్ఐఆర్ (FIR) బుక్ చేయడానికి పోలీసులు నిరాకరించారు. అర్థరాత్రి వరకు అక్కడే ఉన్న కేవలం ఒక అర్జీ (Application) మాత్రమే తీసుకున్నారు.
ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకుడు జిగ్నేష్ మేవానీ తీవ్రంగా స్పందించారు. పోలీసులు రక్షణ కల్పించాల్సింది పోయి, రౌడీల్లా ప్రవర్తిస్తారా ? మహిళా భద్రత గురించి మాట్లాడే ప్రభుత్వం ఇప్పుడెక్కడుంది? అని ప్రశ్నించారు. బాధ్యుడైన పోలీస్ అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జి.ఎస్. మాలిక్ స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
