కే టీ ఆర్ ముందుగా కుటుంబ తగాదాలను పరిష్కరించుకోవాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే ముందు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తన కుటుంబ వివాదాలను పరిష్కరించుకోవాలని కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెంకటస్వామి సూచించారు.
శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ ప్రజాదరణను కోల్పోయిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు, కాంటోన్మెంట్ ఉపఎన్నిక, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పరాజయాలు చూసిందని ఆయన గుర్తు చేశారు.
“ప్రతి ఎన్నికలో ప్రజలు బీఆర్‌ఎస్‌ను స్పష్టంగా తిరస్కరించారు. అయినా పార్టీ ఇప్పటికీ ప్రజల తీర్పును అర్ధం చేసుకొని నేర్చుకోవడం లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పందించారు. ప్రజల తీర్పు నిరంతరం బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వస్తోందని, ఇది పార్టీపై ప్రజల్లో ఉన్నా వ్యతిరేకత అని ఆయన స్పష్టం చేశారు.
కే టి ఆర్ గారు ముందుగా తన సోదరి కవిత చేస్తున్న వ్యాఖ్యలకు జవాబు ఇవ్వాలని సూచించారు మంత్రి గారు.
