Bharat Nagar Case: 14 ఏళ్ల తర్వాత కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్, డిసెంబరు 29 : సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో (Bharat Nagar) 2011లో చోటుచేసుకున్న దారుణ హత్యకేసులో కూకట్‌పల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు కరణ్ సింగ్ (అలియాస్ కమ్మ సింగ్)కి మరణశిక్ష విధించింది. మూడో అదనపు డిస్ట్రిక్ట్ జడ్జ్ మండా వెంకటేశ్వరరావు ఈ కేసులో తుది తీర్పు ఇచ్చారు.
మహిళను కత్తితో దారుణంగా పొడిచి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అక్రమ సంబంధం కారణంగా హత్య జరిగినట్లు విచారణలో తేలింది. అప్పటి సనత్‌నగర్ పోలీస్ కానిస్టేబుల్ కప్పరి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ దర్యాప్తు సమయంలో పటిష్టమైన ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలైంది. నిందితుడికి మరణ శిక్ష విధించడంతో 14 ఏళ్ల తర్వాత బాధితురాలికి న్యాయం జరిగిందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ సీపీ అవినాశ్ మొహంతి ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న అధికారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ తీర్పుతో మహిళలపై జరిగే హింస ఘటనలపై చట్టపరమైన దృఢమైన సందేశమని పోలీసులు వ్యాఖ్యానించారు.
