Chinese manja death: మరో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా.. ఏమైందంటే..
చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయనే కారణంతో దాని వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల దానిని అందరూ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. చాలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో అందరూ పతంగులు ఎగరేయడానికి చైనా మాంజానే వినియోగిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలో చైనా మాంజా ఆందోళన కలిగిస్తోంది. చైనా మాంజాలు ప్రాణాలు తీస్తున్నాయనే కారణంతో దాని వాడకంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ అధికారుల నిర్లక్ష్యం, నిఘా లేకపోవడం వల్ల దానిని అందరూ యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. చాలా తక్కువ ధరకే దొరుకుతుండడంతో అందరూ పతంగులు ఎగరేయడానికి చైనా మాంజానే వినియోగిస్తున్నారు. అయితే ఇది చాలా మంది ప్రాణాలు తీస్తోంది (manja kite string accident).
ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి చైనా మాంజా వల్ల గొంతు కోసుకుపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు (dangerous Chinese manja). తాజాగా మరో వ్యక్తి చైనా మాంజా వల్ల తీవ్ర గాయాలపాలయ్యాడు. హైదరాబాద్ పాతబస్తీ నవాబ్ సాబ్ కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు చార్మినార్ వైపు బైక్ వెళుతున్నాడు. శంషీర్ గంజ్ ప్రాంతంలో చైనా మాంజా అతడి గొంతుకు తగిలి కోసుకు పోయింది. దీంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
