గద్వాల జిల్లాలో దారుణం
కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసిన తండ్రి.
సహకరించిన మొదటి భార్యను, నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు.
గద్వాల జిల్లా కేంద్రంలో నివాసముంటున్న ఒక వ్యక్తి గతంలో ఒక మహిళను వివాహం చేసుకోగా, తనకు పిల్లలు పుట్టడంలేదని తన చెల్లితో భర్తకు రెండో వివాహం జరిపించిన మహిళ.
రెండో భార్యకు నలుగురు సంతానం కలగగా, ఇదే సమయంలో మొదటి భార్యకు జన్మించిన ఇద్దరు పిల్లలు.
ఈ క్రమంలో రెండో భార్య కూతురు(16)పై కన్నేసి, ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన తండ్రి.
బాధితురాలు గర్భం దాల్చడంతో, విషయం బయటికి రాకుండా బాలికకు అబార్షన్ చేయించిన వ్యక్తి మొదటి భార్య.
ఈ విషయాన్ని బాలిక స్థానికంగా ఉండే మరో మహిళకు చెప్పగా, బాధితురాలి తల్లికి విషయాన్ని తెలియజేసిన స్థానిక మహిళ.
బాలిక కన్న తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, తండ్రి, అతని మొదటి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
