తప్పుడు ఆధారాలు చూపించి రాష్ట్రపతి నుండి రూ.2 కోట్ల అవార్డు అందుకున్న తెలంగాణ ఐఏఎస్ అధికారి
జల్ సంజయ్ పథకం ప్రకారం, జిల్లాలో వర్షపు నీరు ఒడిసి పట్టేందుకు నీరు నిల్వ చేసే కుంటలు నిర్మించిన వారికి అవార్డులు ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
ఈ పథకానికి సంబంధించి, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో పూర్తి స్థాయిలో జల్ సంజయ్ పథకానికి సంబంధించిన పనులు పూర్తి చేసినట్లు తప్పుడు ఆధారాలు చూపించి, ప్రెసిడెంట్ చేతుల మీదుగా రూ.2 కోట్ల అవార్డు అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్.
పనులు చేసిన ఫొటోలు పెట్టకుండా, జాతీయ జెండా ఫోటో అప్లోడ్ చేసిన దీపక్ కుమార్.
పనులు చేసిన ఆధారాలు చూపకుండా, జాతీయ జెండా ఫోటో పెడితే రూ.2 కోట్ల అవార్డు ఎలా ఇస్తారంటూ నెటిజన్లు మండిపాటు.
