త్వరలో తెలంగాణలో 14 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్!
హైదరాబాద్:డిసెంబర్ 31
పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు డీజీపీ శివధర్ రెడ్డి, శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ స్థాయిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. దాదాపు 14 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోందని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఖాళీలకు సంబం ధించిన పూర్తి ప్రతిపాదనల ను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి లభించిన వెంటనే నోటిఫికే షన్ విడుదల చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.ఈ ప్రకటనతో వేలాది మంది నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీస్ శాఖలో నియామకాలు ఆశించిన స్థాయిలో జరగలేదన్న విమర్శలు ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వా త ఇప్పటివరకు కేవలం మూడు సార్లు మాత్రమే కానిస్టేబుల్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2016, 2018, 2022 సంవత్సరా ల్లో మాత్రమే నియామక ప్రకటనలు రావడంతో, ప్రతి ఏడాది కొత్తగా అర్హత సాధించిన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు తరచుగా విడుదల చేయాలంటూ నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
డీజీపీ ప్రకటనతో నిరుద్యో గులకు కొంత ఊరటనిచ్చి నట్టుగా కనిపిస్తోంది. పోలీస్ శాఖలో ఖాళీలు ఎక్కువగా ఉండటం వల్ల విధుల్లో భారం పెరుగుతోం దని అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు. కొత్తగా కానిస్టేబుళ్ల నియా మకంతో ప్రజా భద్రత మరిం త మెరుగుపడుతుందని, పోలీస్ వ్యవస్థబలోపేతం అవుతుందని ఉన్నతా ధికారులు అభిప్రాయపడు తున్నారు.
ముఖ్యంగా పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది కొరతను తగ్గించేందుకు ఈ నియా మకాలు ఉపయోగపడతా యని చెబుతున్నారు.ఇక అభ్యర్థుల పరంగా చూస్తే, ఈ నోటిఫికేషన్ కోసం గత కొన్నేళ్లుగా శారీరక దృఢత్వం, రాత పరీక్షల కోసం కఠినంగా శ్రమిస్తున్న యువత ఎంతోమంది ఉన్నారు.
డీజీపీ ప్రకటనతో వారు మళ్లీ సిద్ధతను వేగవంతం చేస్తున్నారు. అయితే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టమైన తేదీ ప్రకటించ కపోవడంతో కొంత ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. ప్రభుత్వం త్వరగా అనుమతి ఇచ్చి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే నిరుద్యోగ యువతకు నూతన సంవత్సరములో ఇది నిజమైన శుభవార్తగా మారనుంది.
