Shamshabad Airport: శంషాబాద్‌లో ప్రతికూల వాతావరణం.. 10 విమాన సర్వీసులు రద్దు
హైదరాబాద్: ప్రతికూల వాతావరణం వల్ల శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లాల్సిన 10 విమానాలు రద్దు అయ్యాయి. ముంబయి, బెంగళూరు, విశాఖ, కోయంబత్తూర్, కోల్‌కతా, కోచి, వారణాసి, ఇందౌర్, పట్నా, గువాహటికి వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం.. తెలంగాణలో భారీగా పొగమంచు కమ్ముకుంది. హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్- బెంగళూరు హైవేలపై దట్టంగా అలముకోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. పొగమంచుతో హైదరాబాద్- బెంగళూరు హైవేపై నాలుగు లారీలు పరస్పరం ఢీకొన్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి పాలమాకుల వరకు సుమారు 10 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డుపైనా పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
