సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్నారా..? LB నగర్లో ఈ పరిస్థితి చూసి బయల్దేరడం బెటర్ !
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ సిటీ పబ్లిక్ సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో ఎల్. బి నగర్లో ఉన్న విజయవాడ బస్టాండ్ పండుగ కోసం వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండగ సెలవులతో సొంతూళ్లకు వెళ్తున్న వారితో బస్టాండ్లలో రద్దీ పెరిగింది. సంక్రాంతి పండుగకు స్వగ్రామలకు వెళ్ళే ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
పండగ సెలవుల ప్రారంభం కావడంతో సామాన్య ప్రజలు, విద్యార్థులు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టికెట్లు బుకింగ్ కౌంటర్లను పెంచింది. బస్టాండ్లు, ప్రధాన రహదారుల దగ్గర ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కేపీహెచ్బీలో పరిస్థితి ఎలా ఉందంటే..
* పిల్లాజల్లా, ముల్లెమూటలతో సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు ప్రయాణిస్తున్న పబ్లిక్
* మియాపూర్, కూకట్ పల్లి, KPHB, మూసాపేట్, JNTU పరిసర ప్రాంతాల నుంచి మొదలు అవ్వనున్న ట్రావెల్ బస్సులు
* KPHB మెట్రో వద్ద అధికారుల ఏర్పాట్లు.. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీస్, ఆర్టీసీ అధికారుల నిరంతర పర్యవేక్షణ
* మైక్ ల ద్వారా ప్రతి బస్సుకు సంబంధించిన సమాచారం చెప్తున్న అధికారులు
* KPHB, కూకట్ పల్లిలో, మియాపూర్‌లలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్
* KPHB నుంచి విజయవాడ, రాజమండ్రి, గుంటూరు శ్రీకాకుళం, అనంతపురం, కర్నూలు, విశాఖపట్నంలకు ప్రయాణాలు
* రద్దీతో కిటకిటలాడుతున్న బస్ స్టాప్‌లు
కోర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఏంటంటే..
* నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల రద్దీ
* సంక్రాంతి సెలవులు రావడంతో పల్లె బాట పట్టిన పట్నం వాసులు
* విజయవాడ వైపునకు 6 గేట్లు, హైదరాబాద్ వైపుకు 6 గేట్లు ఓపెన్ చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న టోల్ సిబ్బంది
