శంకుస్థాపనలు: రూ.175 కోట్ల పనులకు శ్రీకారం
రామగుండం అభివృద్ధికి మంత్రుల శంకుస్థాపనలు: రూ.175 కోట్ల పనులకు శ్రీకారం
రామగుండం నగర అభివృద్ధికి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.80.52 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, రూ.88.90 కోట్ల తాగునీటి సరఫరా పైప్‌లైన్ నిర్మాణ పనులకు, రూ.6.50 కోట్ల రహదారులు, భవనాల శాఖ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ పథకం కింద ఇండ్ల మంజూరు పత్రాలు, పట్టాలు, రెండు పడక గదుల ఇండ్ల ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
