విజయవాడ ప్రయాణికులకు పూలతో శుభాకాంక్షలు – ‘హ్యాపీ జర్నీ’ చెప్పిన సూర్యాపేట ఎస్పీ నర్సింహ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని విజయవాడకు వెళ్తున్న వాహనదారులకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ సందర్భంగా ప్రయాణికులకు పూలు అందజేస్తూ ‘హ్యాపీ జర్నీ’ అంటూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వేగ నియంత్రణతో పాటు సీటుబెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని ఎస్పీ సూచించారు. పండుగ వేళ ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. పోలీసుల ఈ ఆత్మీయ చర్యకు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు.
