ఆరోగ్య భారత్ ప్రధాని మోదీ లక్ష్యం
ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, వాతావరణంలో మార్పుల కారణంగా అనారోగ్యానికి ఒబెసిటి కి గురౌతున్నాం. అందుకే ఫిట్ ఇండియా లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పని చేస్తుంది అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన “Sundays On Cycle”… 57th హైదరాబాద్ ఎడిషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యంశాలు ఇవి. ఒబెసిటి తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందుకే మోడీ గారు ఆయిల్ వినియోగం తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మానసిక ఒత్తిడి కూడా అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మా చిన్నప్పుడు మా బాల్యంలో మన పనులు మనమే చేసుకునే వాళ్ళం కానీ నేడు పరిస్థితి మారింది పెరిగిన టెక్నాలజీ మారుతున్నా కాలానికి అనుగుణంగా పని భారం తగ్గడం కుడా అనారోగ్య సమస్యలకు కారణం.
అందుకే ఫిట్ ఇండియా ద్వారా ఆరోగ్య భారత్ కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుంది. శక్తివంతమైన యువత దేశంలో ఉంది యువత ఆరోగ్యాంగా ఉంటేనే ఆరోగ్య భారత్ నిర్మాణం జరుగుతుంది అప్పుడే శక్తివంతమైన ఆరోగ్యవంతమైన యువత దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది.
ఇది జరిగితేనే దేశానికి సేవ చేయగలం దేశం మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యవంతమైన యువత మేధస్సే దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషిస్తుంది.
