మునుగోడులో మద్యం షాపుల సమయాల్లో మార్పు లేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం
హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపుల సమయపాలనలో ఎలాంటి మార్పు ఉండదని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే వైన్ షాపులు తెరవాలని, సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూములకు అనుమతి ఉంటుందని మద్యం షాప్ నిర్వాహకులను ఆదేశించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠిన నియంత్రణ కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం (జనవరి 18) మునుగోడు ఎమ్మెల్యే కార్యాలయంలో మద్యం వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాపారం కోసం ప్రజారోగ్యాన్ని బలి చేయవద్దని సూచించిన రాజగోపాల్ రెడ్డి, ఉదయం మద్యం సేవను పూర్తిగా నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
