జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బ్రేక్ ఫెయిల్ కావడంతో టవేరా కారు అదుపు తప్పి కల్వర్ట్ వద్ద బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 14 మందికి గాయాలు కాగా, అందులో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
తీవ్రంగా గాయపడిన వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి, మిగిలిన వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులు హైదరాబాద్ కు చెందినవారు వేములవాడ దర్శనం అనంతరం కొండగట్టు దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
