ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ
తెలంగాణ పోలీస్ శాఖ మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాధితులు తమ ఇంటి వద్ద నుంచే ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఫిర్యాదు చేయలేని పరిస్థితుల్లో ఉన్నవారి ఇంటికే పోలీసులు వెళ్లి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఇది ప్రజలకు పెద్ద ఊరటగా మారనుంది. ఇదిలా ఉండగా సైబర్ నేర బాధితుల కోసం ప్రారంభించిన ‘సీ-మిత్ర’ సేవ మంచి ఫలితాలు ఇస్తోంది.
