తొలి రోజు దావోస్‌లో బిజీబిజీగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం
తొలి రోజు దావోస్‌లో బిజీబిజీగా తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం
దావోస్ పర్యటన తొలి రోజే తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం బిజీబిజీగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్‌తో భేటీ అయ్యారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌లపై సహకార అవకాశాలను చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, హెల్త్‌టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతు, భాగస్వామ్యంపై సానుకూలంగా స్పందించింది.
