టీటీడీ లక్కీ డ్రా పేరుతో మోసం – ఇద్దరు నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబాటు
ఆదిభట్ల వండర్ లా వద్ద ప్రచారం • పంజాగుట్ట పోలీసుల సహకారంతో పట్టుకున్న కరాటే కళ్యాణి • ప్రతిఘటనలో చున్నీ లాగిన నిందితులు
టీటీడీ లక్కీ డ్రా పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రచారం చేస్తున్న ఇద్దరు నిందితులను కరాటే కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆదిభట్ల వండర్ లా ప్రాంతంలో నిందితులు అనుమానాస్పదంగా ప్రచారం చేస్తుండటాన్ని గమనించిన కళ్యాణి, వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా నిందితులు కళ్యాణిపైకి దూసుకువచ్చి ఆమె చున్నీ లాగినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రజలు ఇలాంటి లక్కీ డ్రా ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
