రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం
విహారయాత్ర నుంచి తిరిగివస్తున్న విద్యార్థుల బస్సులకు ఢీ
26 మంది విద్యార్థులకు గాయాలు – ప్రాణ నష్టం తప్పిన పెను ప్రమాదం
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు వద్ద మంగళవారం (జనవరి 20) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును మరో రెండు టూరిస్ట్ బస్సులు వెనుక నుంచి ఢీకొనడంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
అసలేం జరిగిందంటే…
నల్లగొండ జిల్లా గుండ్లపల్లి మోడల్ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీకి చెందిన
👉 9వ, 10వ తరగతి
👉 ఇంటర్ విద్యార్థులు
👉 ఉపాధ్యాయులు, సిబ్బంది
రెండు బస్సుల్లో ఏపీకి విహారయాత్రకు వెళ్లారు. అరకు, పాడేరు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు పర్యటించి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది.
గేదె అడ్డు రావడంతో సడెన్ బ్రేక్
ముందుగా వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు అకస్మాత్తుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న విద్యార్థుల రెండు బస్సులు ఆ ట్రావెల్స్ బస్సును ఢీకొన్నాయి.
26 మందికి గాయాలు
ఈ ప్రమాదంలో
- 26 మంది విద్యార్థులకు గాయాలు కాగా
- పలువురు విద్యార్థులు, సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి గాయాలైన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు
ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
