సచివాలయ స్పోర్ట్స్ మీట్ – 2026 ఘనంగా ప్రారంభం
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్, తెలంగాణ శాసనసభ మరియు లోక్ భవన్ ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహిస్తున్న సచివాలయ స్పోర్ట్స్ మీట్ – 2026 ఎల్బీ స్టేడియంలో ఉదయం 11.30 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్ హాజరై క్రీడలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, పనిలో ఒత్తిడిని తగ్గించి స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ స్పోర్ట్స్ మీట్లో క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ (100 మీటర్లు, రిలే రేస్) వంటి పలు ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడా పోటీలు నిర్వహించబడుతున్నాయి. వివిధ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్, ట్రెజరర్ కైలాష్, స్పోర్ట్స్ సెక్రటరీ వంశీదర్ రెడ్డితో పాటు ఆఫీస్ బేరర్స్ నవీన్, ఆయిష తబస్సుమ్, రాము భూక్యా, కంచెర్ల శ్రీనివాస్ రెడ్డి, నీరజాక్షి, రాజేశ్వర్, కనక తార తదితరులు పాల్గొన్నారు.
