చైనా మాంజా బారిన ఐదేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ | కూకట్‌పల్లి:
చైనా మాంజా బారిన ఐదేళ్ల చిన్నారి మృతిచెందిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ కూకట్‌పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ద్విచక్ర వాహనంపై ముందుభాగంలో కూర్చున్న బాలిక మెడకు చైనా మాంజా దారం చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడింది.
ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
