మేడారం జాతర.. మాంసానికి రూ.400 కోట్లు!
తెలంగాణలో నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన మేడారం మహాజాతరకు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చారు. ఈ జాతర సందర్భంగా భక్తులు సుమారు రూ.1,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా వేస్తున్నారు.
సమ్మక్క–సారలమ్మలకు నైవేద్యంగా సుమారు 14 లక్షల మేకలు, గొర్రెలను బలిచ్చినట్లు సమాచారం. ఒక్క మద్యం కొనుగోళ్లకే సుమారు రూ.10 కోట్లు వెచ్చించగా, మాంసం–మద్యం కలిపి వ్యయం రూ.400 కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది.
ఇక జాతరలో కోటికి పైగా కొబ్బరికాయలు, సుమారు 500 టన్నుల బెల్లం విక్రయాలు జరగడం విశేషం. మేడారం జాతరతో స్థానికంగా భారీ ఆర్థిక చలనం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
