త్వరలో హైబ్రిడ్ ATMలను ప్రవేశపెట్టనున్న కేంద్రం
ప్రజలకు రోజువారీ లావాదేవీల్లో సౌలభ్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లు విస్తృతంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే, వాటి బదులుగా చిన్న నోట్లతో పాటు నాణేలు కూడా అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
చిన్న కరెన్సీకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ముద్రణను మరింత పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను (RBI) కేంద్ర ప్రభుత్వం కోరనున్నట్లు సమాచారం.
