చెన్నూరు మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్‌తో ఎన్నికల ప్రచారం – మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూరు:
చెన్నూరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కార్మిక, మైనింగ్ శాఖా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన మంత్రి, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్న మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ అభివృద్ధిని కొనసాగించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
