రాష్ట్రవ్యాప్తంగా 14 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవం: ఎన్నికల సంఘం
హైదరాబాద్ :
రాష్ట్రవ్యాప్తంగా 14 మున్సిపల్ వార్డులు ఏకగ్రీవమైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని బుధవారం వెల్లడించారు. వీటిలో 10 చోట్ల కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,982 మున్సిపల్ వార్డులకు 12,930 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని తెలిపారు. వీరందరికీ ఎన్నికల గుర్తులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ వార్డులకు ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తులు కేటాయించినట్లు తెలిపారు.
పార్టీల వారీగా పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్య ఇలా ఉంది:
- కాంగ్రెస్: 2,936 మంది
- బీఆర్ఎస్: 2,876 మంది
- బీజేపీ: 2,634 మంది
- ఇండిపెండెంట్లు: 2,786 మంది
- జనసేన: 332 మంది
- ఆప్: 38 మంది
- బీఎస్పీ: 213 మంది
- సీపీఎం: 128 మంది
- ఎంఐఎం: 282 మంది
- ఏఐఎఫ్బీ: 288 మంది
- సీపీఐ: 168 మంది
- ఐయూఎంఎల్: 9 మంది
టీడీపీ, వైఎస్సార్సీపీ నుంచి కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, సంబంధిత పార్టీలు బీ ఫారాలు సమర్పించకపోవడంతో ఆ నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
