హైదరాబాద్ మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్
కూకట్‌పల్లిలో లేక్ షోర్ మాల్లో పీవీఆర్ ఐనాక్స్ 9 స్క్రీన్లు ప్రారంభం
హైదరాబాద్‌లో పీవీఆర్ స్క్రీన్లు 119కి చేరిక
హైదరాబాద్:
హైదరాబాద్‌లోని సినిమా ప్రేమికులకు శుభవార్త. కూకట్పల్లి ప్రాంతంలో ఇటీవల ప్రారంభమైన లేక్ షోర్ మాల్లో పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్‌కు చెందిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 9 స్క్రీన్లు అందుబాటులోకి వచ్చాయి.
ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్‌లో పీవీఆర్ ఐనాక్స్ 19వ థియేటర్‌గా లేక్ షోర్ మాల్ మల్టీప్లెక్స్ ఆవిర్భవించింది. దీంతో నగరవ్యాప్తంగా పీవీఆర్ స్క్రీన్ల సంఖ్య 119కి చేరిందని మల్టీప్లెక్స్ యాజమాన్యం వెల్లడించింది.
ఈ మల్టీప్లెక్స్‌లోని స్క్రీన్–6ను ప్రత్యేకంగా PXL పేరిట తీర్చిదిద్దారు. ఇందులో భారీ తెర, 4K లేజర్ ప్రొజెక్షన్‌తో పాటు అత్యాధునిక సౌండ్ సిస్టమ్‌ను అమర్చినట్లు నిర్వాహకులు తెలిపారు.
చిన్నారులతో సినిమాలకు వచ్చే తల్లిదండ్రుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్క్రీన్–5ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక ప్లే ఏరియా, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
ప్రతి స్క్రీన్‌ను ఒక్కో ప్రత్యేక థీమ్‌తో రూపొందించామని, అత్యున్నత స్థాయి సీటింగ్, ప్రీమియం సదుపాయాలు ఉన్నప్పటికీ టికెట్ ధరలు మాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటాయని పీవీఆర్ ఐనాక్స్ నిర్వాహకులు స్పష్టం చేశారు.
