కొడిమ్యాల నమిలకొండలో వార్డు సభ్యులకు శాఖల కేటాయింపుగ్రామాభివృద్ధికి బాధ్యతల విభజన – సర్పంచ్ మహమ్మద్ షాబుద్దీన్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని నమిలకొండ గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం సర్పంచ్ మహమ్మద్ షాబుద్దీన్ వార్డు సభ్యులకు శాఖలను కేటాయించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రతి సభ్యుడికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ షాబుద్దీన్ మాట్లాడుతూ, “గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖను వార్డు సభ్యులకు కేటాయించాం. బాధ్యతలను పంచుకోవడం ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయి. ప్రజలతో నేరుగా అనుసంధానం ఏర్పడి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి” అని తెలిపారు.
గ్రామస్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, పంచాయతీ పనులు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
శాఖల కేటాయింపు వివరాలు ఇలా ఉన్నాయి:
- 1వ వార్డు – ప్రశాంత్: పారిశుద్ధ్య డంపింగ్ నిర్వహణ
- 2వ వార్డు – దొంతి సారపు మౌనిక: మహిళా, శిశు సంక్షేమ శాఖ నిర్వహణ
- 3వ వార్డు – గోనే పెళ్లి నవ్య: ఆరోగ్య శాఖ నిర్వహణ
- 4వ వార్డు – సాత్రాజీ రాజు: రెవెన్యూ శాఖ నిర్వహణ
- 5వ వార్డు – శ్రీమంతుల వెంకటరమణ: తాగునీటి నిర్వహణ
- 6వ వార్డు – కోనేపల్లి ప్రశాంత్: విద్యాశాఖ నిర్వహణ
- 7వ వార్డు – ఎగుర్ల నవత: వ్యవసాయం, పశుపోషణ శాఖ నిర్వహణ
- 8వ వార్డు – చేలు మల్ల లత: విద్యుత్ శాఖ నిర్వహణ
- 9వ వార్డు – పబ్బా మహేష్: ఉపాధి హామీ పథకం నిర్వహణ
- 10వ వార్డు – కోమటి అనిల్: గృహ నిర్మాణ శాఖ నిర్వహణ
గ్రామ అభివృద్ధి దిశగా ఈ బాధ్యతల కేటాయింపు కీలకంగా మారనుందని గ్రామస్థులు భావిస్తున్నారు.
