భారత ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 Rajya Sabha స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, హర్యానా, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్:
- ఫిబ్రవరి 26 – నోటిఫికేషన్ విడుదల
- మార్చి 5 – నామినేషన్లకు చివరి తేదీ
- మార్చి 6 – నామినేషన్ల పరిశీలన
- మార్చి 9 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
- మార్చి 16 – ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్
- మార్చి 16 – సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్
రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
