Rapido డ్రైవర్లకు నెలకు రూ.లక్ష వరకూ ఆదాయం
హైదరాబాద్: నగరంలో తమ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న డ్రైవర్లు నెలకు రూ.65 వేల నుంచి రూ.1 లక్ష వరకు సంపాదిస్తున్నారని Rapido తెలిపింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 5.4 లక్షల మందికి పైగా యాక్టివ్ కెప్టెన్లు ఉండగా, మొత్తం 34.3 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. కెప్టెన్లు ప్రతిరోజూ సుమారు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు ఆర్జిస్తున్నారని పేర్కొంది. నగరంలో సగం మంది కెప్టెన్లకు ఇదే ప్రధాన ఆదాయ వనరుగా మారిందని తెలిపింది.
ప్రతిరోజూ సుమారు 9.1 లక్షల ప్రయాణాలు రాపిడో ద్వారా జరుగుతున్నాయని, నెలకు దాదాపు 2.43 కోట్ల రైడ్స్ నమోదవుతున్నాయని సంస్థ వెల్లడించింది. ఆఫీసులు, కాలేజీల సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆదాయం స్థిరంగా ఉంటుందని పేర్కొంది.
అదేవిధంగా, ప్రయాణికులకు కూడా నెలకు రూ.10 వేల వరకు ఆదా అవుతోందని రాపిడో ఒక ప్రకటనలో తెలిపింది.
