మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసు: బాల్క సుమన్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
వెబ్‌డెస్క్: మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు నేరుగా మంచిర్యాలలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎదుట హాజరుపరిచారు.
ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, బాల్క సుమన్‌తో పాటు మరో ముగ్గురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే పోలీసులు ఆయనను భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జైలుకు తరలించారు.
అనంతరం బాల్క సుమన్‌ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తీసుకెళ్తున్నారు. కేసు నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
